టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ఈ మధ్యకాలంలో ఏదో ఒక విషయంలో ట్రోల్ కి గురవుతూ ఉన్నది. ముఖ్యంగా స్కిన్ షో విషయంపై అలాగే రూమర్ బాయ్ ఫ్రెండ్ వాళ్లకు కూడా సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా సమంతకు సంబంధించి 10 వ తరగతి రిపోర్టు కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సమంత చదువు గురించి టీచర్ ఈ కార్డు పైన రాసిన ఒక లైన్ కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ విషయాన్ని అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.



సమంత మార్క్ రిపోర్టు కార్డులో సమంత చాలా ప్రతిభ ఉన్న అమ్మాయిగా పేర్కొందిందని అన్ని  సబ్జెక్టులలో  కూడా టాప్ మార్కులు సంపాదించుకుంది ముఖ్యంగా గణితంలో 100 కి 100 ఇతర విషయాలలో 90కి పైకి మార్కులు సంపాదించింది. దీంతో టీచర్ కూడా చాలా ఆనందంతో ఈ రిపోర్టులో.."షి ఈజ్ ఆన్ ఆసెట్ టు ది స్కూల్". అంటూ రాసుకుంది. ఇందుకు అభిమానులు బాధ్యతగా ,సమర్థవంతమైన విద్యార్థిగా ఒకరు అన్నట్లుగ టీచర్ చేత అప్పట్లోనే సమంత ప్రసంశలు అందుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.


ఇక నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు అనంతరం మళ్లీ వివాహం చేసుకోకుండా ఉన్నది.కానీ నాగచైతన్య మాత్రం శోభితని ప్రేమించి మళ్లీ వివాహం చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్ భార్యకు విడాకులు ఇస్తే ఆ తర్వాత వీరి వివాహమే అన్నట్లుగా గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ సమంత మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో క్లారిటీ ఇస్తూ ఉన్నది. మరి తనపై వస్తున్న రూమర్లకు ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం సమంత స్కూల్ కార్డు మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: