చాలా సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు "ఆర్య" అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ కి సుకుమార్ కి దిల్ రాజ్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య 2 అనే మూవీ వచ్చింది. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది.

కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మాత్రం మంచి రెస్పాన్స్ లభించింది. గత కొంత కాలంగా దిల్ రాజు "ఆర్య 3" అనే సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు అని , అందులో భాగంగా ఫిలిం ఛాంబర్ లో టైటిల్ని కూడా రిజిస్టర్ చేయించాడు , ఈ మూవీ ని అల్లు అర్జున్ హీరోగా కాకుండా తన సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. తాజాగా దిల్ రాజు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా మీరు ఆర్య 3 అనే మూవీ ని నిర్మించాలి అనుకుంటున్నారా ..? అనే ప్రశ్న ఎదురయింది.

దానికి దిల్ రాజు సమాధానం చెబుతూ ... కొంత కాలం క్రితం నేను ,  సుకుమార్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చిన్న ఐడియా తట్టింది. దానిని ఆర్య 3 అనే టైటిల్తో రూపొందిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. దానికి సుకుమార్ దర్శకుడిగా ఉండడు. అద్భుతమైన పనితనంతో ఎవరైనా ఆ సినిమా కోసం పని చేస్తే అతన్ని మూవీ కి దర్శకుడుగా పెట్టుకుంటాం. ఇక ఆ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తాడు అని వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. కథ మొత్తం పూర్తి అయ్యాక హీరోగా ఎవరు ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: