చెన్నై చిన్నది త్రిష పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన కథానాయిక.. ఈమె సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు దాటిపోయింది.. అయినా ఇప్పటికీ  సినిమాల్లో దూసుకుపోతూ కనిపిస్తోంది.. సినీ కెరియర్ పరంగా త్రిష అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నా కానీ, తన సొంత లైఫ్ లో పెళ్లి విషయంలో వెనుకబడిందని చెప్పవచ్చు.. కేవలం వివాహం చేసుకోవడంలో వెనకబడ్డ త్రిష లవ్ విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకే వేసింది.. చాలామంది హీరోలతో రిలేషన్ లో ఉందని అనేక వార్తలు వినిపించాయి. అంతే కాదు ఒకానొక సమయంలో వారిని పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. వాటిలో నిజం లేదని చివరికి తెలిసింది.

 కట్ చేస్తే త్రిష ఒక హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని తెలుస్తోంది.. అంతేకాదు ఆయనను పెళ్లి కూడా చేసుకోబోతుందని ఈ విషయం ఆ హీరోయిన్ తల్లికి కూడా తెలుసని సమాచారం.. ఇప్పటికే ఆ హీరోకు పెళ్లి కూడా అయింది.. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే  తమిళ స్టార్ విజయ్.. ఈయనతో త్రిష లివింగ్ రిలేషన్ లో ఉందని కోలివుడ్ లో రూమర్లు వినిపిస్తున్నాయి.. తాజాగా ఆ హీరోతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసింది. అదే ఫోటోను ఆమె తల్లి కూడా షేర్ చేస్తూ హార్ట్ ఇమేజీని జోడించింది.

 దీంతో రూమర్స్ మరింత బలంగా వినిపించడంతో తాజాగా త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో లవ్ మీద తనపై వచ్చిన వార్తల మీద పరోక్ష పోస్ట్ పెట్టింది.అందులో ఏముందంటే.. పూర్తిగా ప్రేమలో మునిగిపోయాక కొంతమందిని అది తికమక పెడుతుంది అంటూ పెట్టింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్  త్రిష నిజంగానే ఆ హీరోతో ప్రేమలో పడిందని భావిస్తున్నారు. కానీ దీనిపై త్రిష చాలా సార్లు స్పందించింది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవట్లేదని కెరియర్ పై దృష్టి పెట్టానని  చెప్పింది. ఒకవేళ వివాహం చేసుకోవాలనే ఆలోచన నాకు వస్తే తప్పకుండా బహిరంగంగానే తెలియజేస్తానని అన్నది.. త్రిష సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఐడెంటిటీ, విడాముయార్చి, థగ్ లైఫ్ వంటి చిత్రాలతో మనల్ని పలకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: