అనేక మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు , అలాగే సినిమాను చూసే ఆడియన్స్ కూడా మూవీ కథ కంటే స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం అని , కథ కాస్త రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నట్లయితే అలాంటి సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకుంటాయి అని అభిప్రాయ పడుతున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఇప్పటివరకు చాలా సినిమాలు రొటీన్ కథతో రూపొందిన స్క్రీన్ ప్లే కొత్త దనంతో ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం తమిళ నటుడు కార్తీ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఖైదీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొత్తం కూడా ఒక సింగిల్ నైట్ లోనే ఉంటుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా కథ ప్రకారం చూసుకుంటే చాలా చిన్నగా అనిపించిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు అనే సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... తమ్ముడు సినిమా కథ మొత్తం ఒక నైట్ లోనే కొనసాగుతుంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన కథతో పాటు అదిరిపోయే రేంజ్ స్క్రీన్ ప్లే ను రాసుకున్నాడు. అదే విధంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకుంటుంది అని చెప్పాడు. మరి దాదాపు ఖైదీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న తమ్ముడు సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: