ఏంటి పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక కరీనాకపూర్ తన బాత్రూంలో ఆ హీరోని పెట్టుకుందా.. ఇంతకీ కరీనాకపూర్ మనసు దోచిన ఆ హీరో ఎవరు.. పెళ్లయ్యాక కూడా ఇవేం పాడు పనులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ నటి కరీనాకపూర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈమె కేవలం బాలీవుడ్ కి మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా సుపచితురాలు. అయితే అలాంటి కరీనాకపూర్ రెండో పెళ్లి వాడైన సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుంది.సైఫ్ అలీ ఖాన్ కి మొదట పెళ్లయి పిల్లలు ఉన్నారు.కానీ మొదటి భార్యతో విడాకులు తీసుకోవడంతో కరీనాకపూర్ సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకుంది. అలా ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కత్తి దాడికి గురై మీడియాలో హాట్ టాపిక్ గా మారినసంగతి మనకు తెలిసిందే. 

ఈ విషయం అంత పక్కన పెడితే కరీనా కపూర్ తన బాత్రూంలో సైఫ్ అలీ ఖాన్  కాకుండా మరో హీరోని పెట్టుకుందట. అయితే హీరోని పెట్టుకుంది అంటే రియల్ గానే బాత్రూంలో మరో హీరో ని తీసుకొచ్చి పెట్టుకుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. హీరోని కాదు హీరో ఫోటోను..అవును మీరు వినేది నిజమే.బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫోటోని కరీనాకపూర్ తన బాత్రూంలో పెట్టుకునన్నదట. ఇది స్వయంగా కరీనాకపూర్ సల్మాన్ ఖాన్ కి చెప్పిన నిజమట.అయితే ఈ విషయాన్ని సల్మాన్ చెబుతూ ... కరీనాకపూర్ చిన్నతనంలో తన బాత్రూంలో నా ఫోటో పెట్టుకుందట. కానీ ఎప్పుడైతే రాహుల్ రాయ్ ఇండస్ట్రీలోకి వచ్చాడో అప్పుడు తన బాత్రూంలో నా ఫోటోను తొలగించి ఆ హీరో ఫోటోని పెట్టుకుందట.
ఇక ఈ విషయాన్ని స్వయంగా కరీనా నాతో చెప్పింది అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.. ఇక కరీనాకపూర్ సల్మాన్ కాంబినేషన్లో బాడీగార్డ్, భజరంగీ భాయి జాన్, దబాంగ్ -2, క్యున్ కీ వంటి సినిమాలు వచ్చాయి. ఇక కరీనాకపూర్ సల్మాన్ఖాన్ ని తీసేసి తన బాత్రూంలో పెట్టుకున్న రాహుల్ రాయ్ ఎవరు కాద1990లో బీటౌన్ ని ఒక ఊపు ఊపేసిన హీరో. ఈయన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆషికీ అనే సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఈ సినిమా తర్వాత ఈయనకు దాదాపు 40 సినిమాల్లో ఒకేసారి అవకాశాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని సినిమాలు ఆగిపోయాయి.అలా బాలీవుడ్ లో ఉండే చాలామంది హీరోయిన్లకు కలల రాకుమారుడి గా ఉండే రాహుల్ రాయ్ సినిమాలు సడన్గా ఆగిపోవడంతో ఆయన క్రేజ్ తగ్గి ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: