
అయితే ఇప్పుడు కన్నప్పకు అంత తెలిగ్గా మంచి స్వాగతం వచ్చేలా కనిపించడం లేదు .. ఈ సినిమా ముందు కొన్ని పెను సవాళ్లు ఉన్నాయి .. 3 గంటల 15 నిమిషాల నిడివి అనే వార్త నిజమైతే కనక అంతసేపు ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ సినిమాలో ఉందనే టాక్ కూడా బయటకు రావాలి .. అదేవిధంగా ఓవర్సీస్ లో టికెట్ ధర 24 డాలర్ల దాకా పెట్టారనే టాక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది .. అదే విధంగా కుబేర తరహా లో తెలంగాణలో గరిష్ట ధరలు తీసుకుని ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును వాడుకునే ప్లాన్ లో మంచు విష్ణు ఉన్నట్టు కూడా తెలుస్తుంది .. ఇక ఇదే జరిగితే అంత ధరకు న్యాయం చేసే అతిపెద్ద బాధ్యత ప్రభాస్ కన్నా ఎక్కువ విష్ణు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీదే ఉంటుంది ..
అలాగే పాటలు ఇప్పటికే బాగా రీచ్ అయినప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో స్పందన రావాల్సి ఉంది .. విడుదలయ్యాక ఇది పెరుగుతుందని చిత్ర యూనిట్ నమ్మకం .. యాక్షన్ సన్నివేశాలు , అద్భుతమైన క్లైమాక్స్ , సరిపడా ఎమోషన్స్ , భక్తి అంశాలు , ప్రభాస్ , అక్షయ్ కుమార్ క్యారెక్టర్లు ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయనే వార్తలు చాలానే బయటికి వస్తున్నాయి .. అయితే భారీ బజ్ తెచ్చేందుకు ఈ లీక్స్ ఎక్కడ సరిపోవడం లేదు .. అయితే ఇప్పుడూ జూన్ 27 మార్నింగ్ షో పడేదాకా ఈ సస్పెన్స్ ఇలాగే ఉంటుంది .. ఊహించనంత బడ్జెట్ ఇప్పటికే ఖర్చుపెట్టిన మంచు విష్ణు కన్నప్ప కోసం తన కెరీర్నే పణంగా పెట్టాడు .. ఇక ఇప్పుడు దానికి తగ్గ ఫలితం అందుకుంటాడో లేదో చూడాలి ..