ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . చాలా చాలా టాలెంటెడ్ . అంతకంటే మంచి మనసున్న వ్యక్తి.  పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నాక మరింత పాపులారిటీ సంపాదించుకున్నింది.  ఆ తర్వాత వాళ్ళు విడిపోయాక సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన ట్రోల్లింగ్ ఫేస్ చేసింది.  అయిన రేణూ దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేస్తూనే వచ్చింది. మరీ ముఖ్యంగా రేణు దేశాయ్ ని అందరూ లైక్ చేయడానికి మెయిన్ రీజన్ ఆమె ఓ జంతు ప్రేమికురాలు .


మూగజీవాల సంరక్షణ కోసం కృషి చేస్తుంది . ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల పోస్ట్లు పెట్టి తన వంతు సహాయం చేసిన రేణు దేశాయ్ .. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టికొచ్చింది.. జనాలను రిక్వెస్ట్ చేసింది . "దయచేసి సహాయం చేయండి నా ఎన్జీవో కి మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు" అంటూ విజ్ఞప్తి చేస్తూ చాలా చాలా రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆమె  మంచితనం మరొకసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది.

 

తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రేణు దేశాయ్ ఇలా రాసుకోచ్చారు..విజయవాడలో ఉంటున్న నా మంచి ప్రజలారా..  ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.  దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి. రవి గారికి విరాళం ఇవ్వండి . నా ఎన్జీవో కి మీరు విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి జంతు  సంఘానికి కచ్చితంగా విరాళం ఇవ్వండి " అంటూ దండం పెట్టే ఎమోజీను జోడించి రాసుకుంది.  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మొదటి నుంచి రేణు దేశాయ్ పెట్స్ కోసం అనిమల్స్ కోసం చాలా చాలా కష్టపడుతుంది . పెట్స్ కోసం అనిమల్ సంఘ అనే సంస్థ  గత కొన్ని ఏళ్లుగా నిర్విరామంగా పాటుపడుతుంది.  దానికోసమే రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేశారు . ఒక్క రూపాయి లాభం లేనిదే స్టార్ సెలబ్రెటీస్ ఏ పనులు చేయరు.  అలాంటిదే రేణు దేశాయ్ వేరొకరి కోసం తన సంస్థకు విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు అంటూ చెప్పుకు రావడం నిజంగా  ఆమె మంచితనానికి మరో నిదర్శనం అంటూ తెగ పొగడేస్తున్నారు జనాలు. అలాగే మధ్యలోకి పవన్ కళ్యాణ్ ని కూదా తీసుకొస్తున్నారు. పవన్ - రేణు విడిపోయిన..రేణు దేశాయ్ మాత్రం పవన్ కి ఇష్టమైన పనులే చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  మా మేడమ్ మంచిది అంటూ పొగిడేస్తున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: