హిందూ సాంప్రదాయ ప్రకారం భర్త మరణించిన తర్వాత ఆ భార్య మంగళసూత్రం తీసేస్తారు . అది అందరికీ తెలిసిందే . భర్త మరణించిన తర్వాత ఆ మహిళ ఎట్టి పరిస్థితుల్లోను మంగళసూత్రం మళ్ళీ తిరిగి ధరించదు . రెండో వివాహం చేసుకుంటే తప్పితే భర్త మరణం తర్వాత ఆయన కట్టీన మంగళసూత్రాన్ని ఆ మహిళ ఎట్టి పరిస్థితులోను ధరించదు . ఇప్పటివరకు మనం ఇదే చూసాం . కానీ ఓ  మహిళ మాత్రం భర్త మరణించిన సరే ఆయన కట్టిన మంగళసూత్రాన్ని జాగ్రత్తగా దాచుకొని మెడలోనే వేసుకొని తిరుగుతుంది . అది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీ కావడంతో ఈ విషయాన్ని జనాలు అందరూ పెద్ద రాద్ధాంతం చేసి భూతద్దంలో పెట్టి చూసారు.
 

దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది.  ఆమె మరెవరో కాదు "డిస్కో శాంతి".  ఆయన మరెవరో కాదు "శ్రీహరి".  శ్రీహరి నటన గురించి టాలెంట్ గురించి ఆయన నీతి నిజాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .  శ్రీహరి లాంటి నటుడు ఇండస్ట్రీలో లేడు అనే చెప్పాలి . కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీహరి - డిస్కో శాంతి కొన్నేళ్లపాటు బాగా లైఫ్ని ఎంజాయ్ చేశారు . ఒక పక్క సినిమాలతో మరొక పక్క పర్సనల్ లైఫ్ తో బాగా బిజీ అయిపోయారు . కానీ స్టార్ నటుడుగా వెలుగొందుతున్న శ్రీహరి హఠాత్తుగా కన్నుమూశారు.

 

దీంతో డిస్కో శాంతి తల్లడిల్లిపోయింది . ఆమెకు ఏం చేయాలో తెలియలేదు బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది . అయితే తన బిడ్డలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు మళ్లీ మామూలు మనిషిగా మారింది. అనుకున్నట్టు తన కుమారులను మంచిగా సెటిల్ చేసింది . అయితే చనిపోయిన శ్రీహరి ప్రేమను మర్చిపోలేక గుర్తుగా తాళిబొట్టును మెడలో అలాగే ఉంచుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది . నిజమైన ప్రేమ అంటే ఇదే అంటూ జనాలు ఆమెకు శ్రీహరి పట్ల ఉన్న లవ్ ని పొగిడేస్తున్నారు . కొంతమంది భర్త ఉండగానే విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంటున్నారు . మరి కొంతమంది భర్త చనిపోయిన తర్వాత ముసలోలైన పెళ్లి చేసుకుంటున్నారు . కానీ డిస్కో శాంతి మాత్రం శ్రీహరి మీద ఉన్న ప్రేమతో రెండో పెళ్లి ఆలోచన చేయలేదు. అంతేకాదు ఆయన జ్ఞాపకాలతో తన ఇద్దరు కొడుకులతో లైఫ్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: