
టాలీవుడ్ లో రెండున్నర దశాబ్దాల క్రిందట అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య సినిమా ఒక మ్యాజిక్. అటు అల్లు అర్జున్ .. ఇటు సుకుమార్ కు మంచి టేక్ ఆఫ్ ఇచ్చిన సినిమా ఇది. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న దిల్ రాజుకు దక్కి సూపర్ హిట్ ఇది. ఆ తర్వాత ఆర్య 2 సినిమా తీసిన వర్కౌట్ అవలేదు. ఇప్పుడు మళ్లీ ఆర్య 3 పై ఆశలు పెరుగుతున్నాయి. ఈ టైటిల్ ని ఇటుకల దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమా తీస్తారని అన్నారు. ఆశీష్‌ను హీరోగా ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరో ఆశిష్ కూడా కాదు అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. నేను సుకుమార్ కలిసి పిచ్చపాటి మాట్లాడుకుంటుంటే ఒక ఐడియా పుట్టుక వచ్చింది. ఆడియో ఆర్య 3కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలిపారు.
సుకుమార్ లా సినిమా అంటే పిచ్చి ఉన్న దర్శకుడు ఈ ప్రాజెక్టుకి కావాలి. హీరో ఎవరు అన్నది ? ఇప్పుడే చెప్పలేను .. కానీ ఆశిష్ కోసమే ఈ కథ తయారు చేస్తున్నాం అన్నది నిజం కాదు అని తెలిపారు. దర్శకుడు సెట్ అయ్యాక హీరో దగ్గరికి వెళతాం .. ప్రేమ కథలలో ఆర్య ఎలా అయితే ట్రెండ్ క్రియేట్ చేసిందో .. ఆర్య 3 కూడా అలాగే నిలచి పోతుందని చెప్పారు దిల్ రాజు. సుకుమార్‌లా సినిమా పిచ్చితో పనిచేసే దర్శకుడు కావాలి అంటే సుకుమార్ నుంచే రావాలి. ఆయన దగ్గర భారీ శిష్యగణం ఉంది. ఆయన తన శిష్యులకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ కథ కూడా తన శిష్యుడికి అప్పగించే అవకాశం ఉంది. ఆర్య అంటే తెలుగు ప్రేక్షకులకు బన్నీనే గుర్తుకు వస్తాడు.. బన్నీని కాదని మరో చేతుల్లో పెట్టడం పెద్ద రిస్క్ .. మరి దీనిని ఎంత తెలివిగా రాజు హేండిల్ చేస్తారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు