ఒక సినిమాను ఎంత బాగా తీసామో అనే దాని కంటే ఆ మూవీ ని ఎంత బాగా ప్రమోట్ చేసామో అనేది ప్రస్తుతం ట్రెండ్. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రమోషన్లు పెద్ద స్థాయిలో చేయకపోయినా సినిమా విడుదల అయ్యాక దానికి మంచి టాక్ వస్తే ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసిన కూడా మంచి కలెక్షన్లు సినిమాకి వస్తూ ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. సినిమా విడుదల అయ్యింది అంటే మార్నింగ్ షో కు మంచి టాక్ వచ్చి , ఆ సినిమా గురించి చాలా మంది జనాలకు తెలిస్తేనే ఆ మూవీ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాంటి సినిమాలే మంచి విజయాలను అందుకుంటున్నాయి.

దానితో ఫిలిం మేకర్స్ సినిమాను తీయడం పై ఏ స్థాయి ఇంట్రెస్ట్ ను పెడుతున్నారో ..? ఆ మూవీ ని ప్రమోట్ చేయడంపై అంతే స్థాయి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అదే రేంజ్ లో డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. దానితో మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను అదిరిపోయే రేంజ్ లో చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇకపోతే తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన బిచ్చగాడు మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన చాలా సినిమాల్లో నటించినా ఈయనకు ఆ స్థాయి విజయం దక్కలేదు. తాజాగా ఈయన మార్గన్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించగా ... విజయ్ ఆంటోనీమూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాని నిర్మించాడు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఏకంగా తొలి ఆరు నిమిషాల వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇలా విజయ్ ఆంటోనీ "మార్గన్" సినిమాతో కొత్త రకం ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఇది సక్సెస్ అయితే మరి కొంత మంది ఈ ఫార్ములాను ఫాలో అయ్యే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: