విరాట్ కోహ్లీతో జెనీలియా సరసాలా.. ఇదెక్కడి వీడియో అనుకుంటారు. ఈ వీడియో చూస్తే.. కానీ ఇది ఎడిటింగ్ కాదు నిజమే.. అయితే జెనీలియా కి రితేష్ దేశ్ ముఖ్ తో పెళ్లయ్యింది. విరాట్ కోహ్లీకి అనుష్క శర్మతో పెళ్లయ్యింది.. కానీ జెనీలియా కి విరాట్ కోహ్లీకి మధ్య ఎక్కడ బంధం ఏర్పడింది అని మీరందరూ అనుకోవచ్చు. అయితే వీరిద్దరి మధ్య రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. ఇక విరాట్ కోహ్లీ క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ఎన్నో యాడ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అలా హీరోయిన్లతో విరాట్ కోహ్లీ యాడ్స్ చేశారు. అలా జెనీలియాతో కూడా ఫాస్ట్రాక్ బ్యాగులకు సంబంధించి ఓ యాడ్ చేశారు.అయితే ఈ యాడ్ పక్కన పెడితే జెనీలియా విరాట్ కోహ్లీ కలిసి విమానంలో చేసిన ఓ యాడ్ మాత్రం అప్పట్లో పెద్ద దుమారం సృష్టించింది. 

ఈ యాడ్ పై విమాన సిబ్బంది విపరీతంగా రియాక్ట్ అయింది.. అంతేకాదు లక్షలు ఖర్చుపెట్టి చేసిన ఈ యాడ్ ని బ్యాన్ చేశారు. మరి ఇంతకీ ఆ యాడ్లో అంత తప్పుగా ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఈ యాడ్ లో విరాట్ కోహ్లీ పైలెట్గా జెనీలియా ఎయిర్ హోస్టెస్ కనిపించింది. అయితే ఎయిర్ హోస్టెస్ గా ఉన్న జెనీలియా పైలెట్ గా ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి పదేపదే రొమాంటిక్ గా చూస్తూ విసిగిస్తూ ఉంటుంది.కానీ విరాట్ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఆ తర్వాత కొద్దిసేపటికి విమానం నీ ఆటోపైలెట్ మోడ్ లో పెట్టి జెనీలియాతో ఏకాంతంగా గడిపినట్టు చూపిస్తారు.అయితే విమానంలో ఉండే ఈ ఆటోపైలెట్ ని విమాన సిబ్బంది ఇలాంటి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం కోసమే కనుగొన్నారు అనే విధంగా మెసేజ్ ఇస్తూ యాడ్ ముగిసింది.
అయితే ఈ యాడ్ అప్పట్లో పెద్ద దుమారం సృష్టించింది.దీనిపై విమాన పైలెట్ లు ఎయిర్ హోస్టెస్ లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ వెంటనే ఈ యాడ్ నిషేదించాలి అని అన్నారు. ఇందులో పైలెట్ లని ఎయిర్ హాస్టెస్  ని అవమానించేలా ఉంది అని,అలాగే వందల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా ఈ యాడ్లో చూపించారు వెంటనే దీన్ని నిషేదించాలి.. ఇలాంటి యాడ్స్ వల్ల యువత కూడా చెడిపోతుంది అంటూ రియాక్ట్ అయ్యారట. దాంతో జెనీలియా విరాట్ కోహ్లీ కలిసి చేసిన యాడ్ అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం సృష్టించడంతో బ్యాన్ చేశారు. అయితే తాజాగా అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ జరగడంతో అప్పటి విరాట్ జెనీలియా యాడ్ ఇప్పుడు రెడ్డిట్ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: