ఓటీటీ లో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. కొంత మంది సినిమా బాగుంది అని టాక్ వచ్చిన కూడా చాలా కష్టపడి , డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టి థియేటర్కు వెళ్లి సినిమా చూడడం కంటే కూడా ఒక నెల రోజులు ఆగితే ఆ సినిమా ఓ టీ టీ లోకి వచ్చేస్తుంది. దానిని ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటిల్లిపాది ప్రశాంతంగా చూడవచ్చు అనే ఉద్దేశంతో సినిమా బాగుంది అని తెలిసినా కూడా థియేటర్కు వెళ్లి సినిమా చూడడం లేదు.

దానితో కొన్ని సినిమాలు మంచి టాక్ ను తెచ్చుకున్న థియేటర్లలో భారీ కలెక్షన్లను వసూలు చేయకపోయినా ఓ టీ టీ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ అనే పవర్ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మూవీ కొంత కాలం క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో ఈ సినిమాకు 9.4 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న ఇండియన్ మూవీస్ లో ఈ సినిమా మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇలా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ రికార్డును నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sd