ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎవరు చూసినా సరే ఎక్కువగా "కరుంగలి" మాలను ధరిస్తున్నారు . దీంతో చాలామంది దీని గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  మరి ముఖ్యంగా కొంతమంది కేవలం సినిమాలు హిట్ కోసమే కరుంగి మాల వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా కోలివుడ్  ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు .. దర్శకులు ఎక్కువగా "కరుంగలి" మాల వేసుకుంటూ ఉండడంతో దీనిపై స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు జనాలు. "కరుంగలి" మాల, నల్లమలాయి కలపతో చేసిన ఒక రకమైన మాల. ఇది దక్షిణ భారతదేశంలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది అని పండితులు చెప్పుకొస్తున్నారు. దీనిని సాధారణంగా హిందూ మతంలో ఉపయోగిస్తారు . వారి నమ్మకం ప్రకారం ఈ మాల ధరిస్తే మంచి ఆరోగ్యం, అదృష్టం మరియు జీవితంపై సానుకూల దృక్పథాన్ని తెస్తుందని కొందరు అనుకుంటుంటారు".


కాగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అవుతారు. మరి ముఖ్యంగా మహేష్ బాబు తన సినిమా పూజా కార్యక్రమాలకి అటెండ్ అయితే ఆ సినిమా ప్లాప్ అవుతుంది అనే నమ్మకం . ఆ కారణం గానే ఆయన తన సినిమా పూజా కార్యక్రమానికి అటెండ్ కారు.  ఇలా ఎన్నెన్నో సెంటిమెంట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. బాలయ్య ఆదివారం నలుపు బట్టలు వేసుకోడు.  అది ఒక బ్యాట్ సెంటిమెంట్ . కాగా ఇదే క్రమంలో కొంతమంది కోలీవుడ్ స్టార్స్ "కరుంగి" మాల వేసుకుంటే తమకున్న దిష్టి పోతుంది అని పాజిటివ్ వైబ్రేషన్స్ దక్కుతాయని నమ్ముతూ వస్తున్నారు.

 

చాలామంది అలా వేసుకుంటున్నారు అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . కరుంగలి మాల  తద్వారా వాళ్ళ పై ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్ని పోయి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యి.. సినిమాలకి హిట్ టాక్ వస్తుంది అని..ఆ కారణంగానే కరుంగలి మాల ధరిస్తున్నారని కొంత మంది జనాలు మాట్లాడుకుంటున్నారు.  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ మాల ధరించడం చాలా కామన్ అయిపోయింది . ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా అదే పాటిస్తూ వాళ్లకు ఉన్న దిష్టి పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు . ఇక వీటిని కొంతమంది నమ్ముతుంటే మరి కొంతమంది మాత్రం ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు.  కొంత మంది మాత్రం వాళ్లకి ఉన్న దైవభక్తి కారణంగానే ఇలా "కరుంగలి" మాల  వేసుకుంటున్నారు అని ..దినిని కూడా రాద్ధాంతం చేయద్దు అని అభిమానులు సాఫ్ట్ మ్యానర్ లోనే ఇచ్చి పడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: