టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ మూవీ లో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ సినిమా ద్వారా సూపర్ సాలిడ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కింది. ఆ తర్వాత ఈమె ఎంతో మంది తెలుగు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించి ఎంతో కాలం పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.

కానీ ఈ మధ్య కాలంలో ఈమె ఏ తెలుగు సినిమాలో నటించలేదు. ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఈమె ఎక్కువ శాతం తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తుంది. ఇది ఇలా ఉంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా కంటే ముందే ఆమెకు రెండు తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ అవి క్యాన్సిల్ అయ్యాయి. అసలు విషయం లోకి వెళితే ... వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా కంటే ముందే ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ లో కాజల్ పాత్రకు మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు.

ఈమె పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఈ సినిమా నుండి ఆమెని తీసివేశారు. ఇక నాగ చైతన్య హీరో గా రూపొందిన ఆటోనగర్ సూర్య సినిమాలో కూడా మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ మూవీలో ఈమెను కాకుండా సమంత ను ఆ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారు. అలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా కంటే ముందే ఈమె రెండు తెలుగు సినిమాలో అవకాశం కోల్పోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: