ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఈమె అనేక తెలుగు , హిందీ సినిమాలతో పాటు ఎన్నో ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపు సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ పాత్ర ద్వారా రమ్యకృష్ణ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఇక ఒకా నొక ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... మొదట బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్రకు గాను శ్రీదేవిని అనుకున్నట్లు , కానీ శ్రీదేవి "బాహుబలి" సినిమాలో నటించాలి అంటే చాలా కండిషన్స్ పెట్టినట్లు , ఆ కండిషన్స్ వల్లే మేము శ్రీదేవి ని కాకుండా రమ్యకృష్ణ ను ఆ సినిమాలో తీసుకున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో మాత్రమే కాదు శ్రీదేవి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఓ బ్లాక్ బాస్టర్ మూవీ లో కూడా అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి , రాధ హీరోయిన్లుగా కొండవీటి దొంగ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట విజయ శాంతి , రాధ హీరోయిన్లుగా కాకుండా శ్రీదేవి ని హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో , కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: