గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ , చరణ్ కి జోడిగా కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో కీలకకపాత్రలో కనిపించనుండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ నుండి మేకర్స్ కొంత కాలం క్రితం ఓ గ్లీమ్స్ వీడియోని విడుదల చేశారు. అది అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా భారీగా హైప్ పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. కొంత కాలం క్రితమే ఈ మూవీ బృందం రైల్వే స్టేషన్ కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

అది అద్భుతంగా వచ్చినట్లు ఈ మూవీ సినిమాటో గ్రాఫర్ రత్నవేలు కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ నెల చివరన పెద్ది యూనిట్ ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఒక వారం పాటు ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ మూవీ బృందం ఢిల్లీలో కూడా షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుండడంతో బుచ్చిబాబు చాలా పెద్ద ప్లాన్ వేశాడు అని ఆయన చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: