మంచు విష్ణు తిన్నడు పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కన్నప్ప మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ రివ్యూలు వచ్చేయగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలూ చివరి గంట మాత్రం వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కనిపించిన ప్రతి సీన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.
 
కన్నప్ప సినిమా పబ్లిక్ టాక్ బాగున్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్  డే కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. మోహన్ లాల్ పాత్ర ట్రైలర్ లో అర్థం కాకపోయినా కథను మలుపు తిప్పే పాత్రలో  ఆయన కనిపించారు. క్లైమాక్స్ సీన్ లో మాత్రం  మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్  ఇచ్చారు. కన్నప్ప సినిమా విష్ణు కెరీర్ లో  స్పెషల్ మూవీగా నిలిచిపోయే ఛాన్స్ అయితే ఉంది.

కన్నప్ప సినిమాలో  చిన్నచిన్న మైనస్ లు ఉన్నా  సినిమా చూడాలని  భావించే ప్రేక్షకులకు అవి ఏ మాత్రం ఇబ్బంది కలిగించవు.  కన్నప్ప సినిమాకు మోహన్ బాబు పర్ఫామెన్స్ సైతం హైలెట్ గా నిలిచింది.  ప్రభాస్  ఈ సినిమాలో నటించడం  ఈ సినిమాకు  ఎంతగానో ప్లస్ అయిందని  చెప్పవచ్చు. టైర్2,   టైర్3 సిటీలలో  సైతం  ఈ సినిమాకు బుకింగ్స్ మాత్రం అదిరిపోయేలా  ఉన్నాయని చెప్పవచ్చు.

కన్నప్ప సినిమా 200 కోట్ల  రూపాయల బడ్జెట్ తో  తెరకెక్కగా  ఈ సినిమాలో విజువల్స్ సైతం గ్రాండ్ గా ఉన్నాయి.  ఈ సినిమాతో మంచు విష్ణు కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్టేనని  చెప్పవచ్చు.  కన్నప్ప సినిమా కమర్షియల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో  చూడాల్సి ఉంది.  ఈ సినిమా ఫస్ట్  వీకెండ్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: