కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరో గా పాపులారిటీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న హీరో మంచు విష్ణు ఎంతో కష్టపడి తెరకెక్కించిన ప్రాజెక్ట్ "కన్నప్ప".  ఈ సినిమాపై కేవలం మంచు ఫ్యామిలీ కాదు టాలీవుడ్ జనాలు కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . దానికి కారణం ఈ సినిమాలో బిగ్ బడా స్టార్స్ నటిస్తూ ఉండడమే . కాగా కన్నప్ప సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది . ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అవా అండర్టైన్మెంట్ 24 ఫ్రెమ్‌స్  ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచి మోహన్ బాబు నిర్మించారు.


కన్నప్ప నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేలానే చేసింది.  సినిమా గురించి హైప్స్ పెంచేసింది.  కన్నప్ప నుంచి వచ్చిన సాంగ్స్.. టీజర్ ..ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెంచేసాయి . మరీ ముఖ్యంగా సినిమా అంతా ఒక లెవెల్ సినిమాల్లో ప్రభాస్ పాత్ర మే వేరే లెవల్ అని మాట్లాడుకుంటున్నారు జనాలు . కొద్దిసేపటి  క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన కన్నప్ప మూవీ టాక్ బయటికి వచ్చేసింది.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్  అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

 

ఫస్ట్ హాఫ్ స్లో..సెకండ్ హాఫ్ సూపర్..క్లైమ్యాక్స్ ఎమోషనల్.. మంచు విష్ణు యాక్టింగ్ అదిరిపోయింది అని ..ఇది ఆయన  కెరియర్ లో ది బెస్ట్ యాక్టింగ్ అని .. ఇక సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది అంటే మాత్రం ప్రభాస్ - మోహన్ లాల్ పాత్ర అని చెప్పుకొస్తున్నారు. అక్షయ్ కుమార్ - కాజల్ పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అని.. తమదైన స్టైల్ లో రివ్యూలు ఇస్తున్నారు.  మరి ముఖ్యంగా కన్నప్ప సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అంటూ ప్రమోట్ చేస్తున్నారు . దానికి ఐదు కారణాలు కూడా చెప్పుకొస్తున్నారు. .

 

*సినీ ఇండస్ట్రీని ఒక కొత్త దారిలో పెట్టాలి అంటే ఈ పని ఖచ్చితంగా ఆపేయాలి. అది జనాల వల్లే అవుతుంది . కచ్చితంగా సినిమాని థియేటర్లోనే చూడాలి . అదే మంచిది .

*రెండవది ప్రభాస్  ఎంట్రీ సీన్  కోసమైనా థియేటర్ కి వెళ్లే ఈ సినిమా చూడాలి అంటూ ప్రమోట్ చేస్తున్నారు రెబల్ అభిమానులు .

* మరియు ముఖ్యంగా కొన్ని కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ మన చిన్న స్క్రీన్  లో చూస్తే బాగోదు అని పెద్ద స్క్రీన్ లో చూస్తేనే బాగుంటుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

* అంతేకాదు మోహన్ లాల్  చెప్పే డైలాగ్స్ ఆయన యాక్టింగ్ సినిమాని వేరే లెవెల్ లో తీసుకెళ్తుంది అని .. ధియేటర్  సౌండ్ ల తోనే అలాంటి డైలాగ్స్ బాగా పవర్ ఫుల్ గా ఉంటాయని .. నార్మల్ మన  టీవీలో వచ్చే సౌండ్స్ పెద్దగా అనకపోవచ్చు అని చెప్పుకొస్తున్నారు .

*అంతేకాదు ఇంతమంది స్టార్స్ నటించిన సినిమాను థియేటర్లు చూడడం చాలా చాలా బాగుంటుంది అని . థియేటర్ లో జనాల మధ్యలో అరుపులు కేకలతో చూస్తేనే ఆ కిక్కు వస్తుందని .. ఇంట్లో టీవీ లో చూస్తే ఆ ఫీలింగ్ రానే రాదు అని కన్నప్ప సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు.  మరి చూడాలి ఈ కన్నప్ప మూవీకి ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో...!?

మరింత సమాచారం తెలుసుకోండి: