తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి నితిన్ తాజాగా తమ్ముడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఓ మై ఫ్రెండ్ , ఎంసీఏ , వకీల్ సాబ్ సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ లో వర్ష బొల్లమ్మ , సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ లయమూవీ లో నితిన్ కి అక్క పాత్రలో నటించింది.

మూవీ ని జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి నిర్మాత అయినటువంటి దిల్ రాజు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వివరాలను తెలియజేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మూవీ కి చాలా కోట్ల ఖర్చు పెట్టాం. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితం ప్రారంభించాం. అలాగే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఖర్చు విషయంలో అస్సలు వెనకాడకుండా తీర్చిదిద్దాము. ఈ మూవీ లో అదిరిపోయే రేంజ్ కంటెంట్ ఉంది. ఈ సినిమా మొత్తం ఒక సింగిల్ నైట్ లో జరుగుతుంది. ఈ మూవీ కోసం వేణు శ్రీరామ్ అద్భుతమైన కథను రాసుకున్నాడు. అంతకు మించిన స్క్రీన్ ప్లే ను రాసుకున్నాడు అని చెప్పాడు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో కాస్త బడ్జెట్ ఎక్కువ అయితే చాలు సినిమా టికెట్ రేట్లను పెంచేస్తున్నారు. కానీ ఈ మూవీ కి భారీగా ఖర్చు పెట్టాం అని దిల్ రాజు చెప్పినా కూడా ఈ మూవీ ని అత్యంత సాధారణ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు. దీనితో తక్కువ టికెట్ ధరలతోనే ఎక్కువ కలెక్షన్లను రాబట్టాచు అని దిల్ రాజు అనుకుంటున్నట్లు ఉన్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: