కొన్ని సంవత్సరాల క్రితం ఏదైనా ఒక భాషలో ఒక సినిమా రూపొందింది అంటే దాదాపు ఆ సినిమాను కేవలం ఆ ఒక్క భాషలో మాత్రమే విడుదల చేసేవారు. సినిమా విడుదల అయ్యి కొన్ని రోజులు ముగిసిన తర్వాత కొన్ని సినిమాలను వేరే భాషలో విడుదల చేసేవారు. అలాంటి సమయంలో ఆ సినిమాకు ఆ భాషకు తగిన టైటిల్ను పెట్టేవారు. ఇక ఆ తర్వాత సినిమాలను పెద్ద ఎత్తున ఒకే సారి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇకపోతే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను విడుదల చేసే సమయంలో ఒకే టైటిల్తో అన్ని భాషల్లో సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు.

దానితో సినిమా రీచ్ కూడా హెవీగా ఉండడం జరుగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్ "కూలీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో  ఓ కీలకమైన పాత్రలో కనిపించడున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో రజినీ కాంత్ హీరో గా నటిస్తూ ఉండడం ... నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటించడం , లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై అదిరిపోయే రేంజ్ అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఈ మూవీ ని దాదాపు అన్ని భాషలలో కూలీ అనే టైటిల్ తోనే విడుదల చేస్తున్నారు. కానీ హిందీ భాషలో మాత్రం ఈ మూవీ ని కూలీ అనే టైటిల్ తో కాకుండా కూలీ ది పవర్ హౌస్ అనే టైటిల్తో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఇలా ఈ మూవీ హిందీ ప్రేక్షకుల ముందుకు మాత్రం కూలీ ది పవర్ హౌస్ అనే టైటిల్ తో రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: