నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్లీమ్స్ వీడియోను మేకర్స్ చాలా రోజుల క్రితం విడుదల చేశారు. అది అద్భుతమైన రీతిలో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. ఇక ఈ మూవీ గ్లీమ్స్ వీడియోను బట్టి చూస్తే ఈ సినిమా కాస్త డిఫరెంట్ కథాంశంతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో నాని మేకవర్ కూడా చాలా సరికొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ది ప్యారడైజ్ మూవీ లో విలన్ పాత్రలో నటించబోతుంది ఎవరు అనేది బయటకు వచ్చేసింది. అసలు విషయం లోకి వెళితే ... మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్లో భాగంగా కన్నప్ప సినిమా దర్శకుడు అయినటువంటి ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ... మోహన్ బాబు గారు నాని హీరోగా రూపొందుతున్న సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. దీనితో ఒక్క సారిగా మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు అనే వార్త బయటకు రావడంతో ది ప్యారడైజ్ మూవీ పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ఈ మధ్య కాలంలో మోహన్ బాబు ఏ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించలేదు. చాలా కాలం తర్వాత ది ప్యారడైజ్ మూవీ లో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని తెలియడంతో ఈ మూవీ కథలో కచ్చితంగా మంచి కంటెంట్ ఉండి ఉంటుంది అందుకే మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: