
నిరంతరం వివాదాలతో ఫేమస్ అవుతున్న వారిని కూడా హౌస్ లోకి ఆహ్వానించబోతున్నారట. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి ప్రోమో అని లాంచ్ చేయడం జరిగింది.. ఎప్పటిలాగే నాగార్జున ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదని.. ఆ గెలుపు రావాలి అంటే అందుకు యుద్ధం చేయాలి కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించారు కానీ ఈసారి రణరంగమే అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ప్రోమో కి హైలైట్ గా నిలుస్తోంది.
కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్2 సీజర్ కి సంబంధించిన వారిలా చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి కాంటెస్ట్ గా అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొదలు కాబోతున్న కుక్ విత్ జాతి రత్నాలు అనే కామెడీ షో లో కూడా కొంతమంది కాంటెస్ట్ టెన్స్ ని సైతం హౌస్ లోకి తీసుకు పోయేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఏ మేరకు ఎవరెవరిని కంటెస్టెంట్ గా తీసుకుంటారు అనే విషయం చూడాలి మరి. మొత్తానికి ప్రోమోతో బిగ్ బాస్ ఆడియన్స్ అని బాగా ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.