మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ అయింది .. కాగా ఈ సినిమాలో నెమలి అనే పేరుతో హీరోయిన్గా తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ నటించింది .. ఇక ఈమెకు రెండో తెలుగు సినిమా .. గతంలో ప్రీతి ముకుందన్ శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ మూవీ లో నటించింది . తమిళనాడు లోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది .. అలాగే హిప్‌హాప్‌ నాట్యంలో కూడా ఎంతో ప్రామాణ్యం తెచ్చుకుంది . ఆమె చదువు విషయానికి వస్తే బీటెక్ కంప్లీట్ చేసింది . చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసింది ప్రీతి .. ఆ సమయంలోనే పలు వాణిజ్య ప్రకటనలోను నటించింది .


అలాగే సినిమాల్లోకి రాకముందు కొన్ని ఆల్బమ్ పాటలు , మ్యూజిక్ వీడియోలోను నటించి మెప్పించింది ఈ బ్యూటీ .. ఇలా ప్రీతి నటించిన తొలి మ్యూజిక్ ఆల్బమ్  ‘ముత్తు ము 2’.. యూట్యూబ్ లో ఈ ఆల్బమ్ కు దాదాపు 6 మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి .. అలాగే ఓం భీమ్ బుష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది ఈ భామ , ఈ సినిమాలో ఈమె జలజ అనే క్యారెక్టర్ లో నటించి మెప్పించింది .అలాగే ఓం భీమ్ బుష్‌ తర్వాత ప్రీతి చేసిన మ్యూజిక్ వీడియో ఆశ కూడా  ఇంటర్నెట్ ను బాగా షేక్ చేసింది .. అలాగే బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్షా 'మోర్నీ' మ్యూజిక్ వీడియోలోను ఈ బ్యూటీ సందడి చేసింది . ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి టాలీవుడ్ ను పలకరించింది .. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..




మరింత సమాచారం తెలుసుకోండి: