మంచు విష్ణు చాలా రోజులకి ఒక భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ తో మంచు విష్ణు కి బూస్టింగ్ వచ్చినట్టు అయింది. చాలా రోజుల నుండి హిట్స్ లేక సతమతమవుతున్న మంచు విష్ణుకి కన్నప్ప మూవీ పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో మంచు విష్ణు కంటే ఎక్కువగా ప్రభాస్ నే పొగుడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాని మంచు విష్ణు కి ఉండే అభిమానుల కంటే ప్రభాస్ అభిమానులే ఎక్కువగా చూసారు. ఎందుకంటే మంచు విష్ణుకి అంత ఫాలోయింగ్ ఉండదు. ప్రభాస్ కి ఉన్న అభిమానులే కన్నప్ప సినిమాని గట్టెక్కించారని చాలామంది నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు..

అంతేకాదు ఈ సినిమాలో  మంచు విష్ణు కంటే ఎక్కువగా ప్రభాస్ ఫేమస్ అయ్యారు.దాంతో విష్ణు బతికి బయటపడ్డాడు. కన్నప్ప మూవీ లో గనుక ప్రభాస్ నటించకపోతే విష్ణు పరిస్థితి మరోలా ఉండేది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పలో ఆయన తండ్రి మోహన్ బాబు అలాగే ఆయన నలుగురు పిల్లలు కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తన భార్య విరానిక ని కూడా ఈ సినిమాలో నటించమని ఓ సందర్భంలో మంచు విష్ణు అడిగారట. ఇక ఈ విషయం గురించి రీసెంట్గా ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాలో మా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ నటించారు. 

మా నాన్న, నా నలుగురు పిల్లలు కూడా కనిపించారు.దాంతో నా భార్య విరాణికను కూడా ఇందులో ఒక చిన్న పాత్రలో నటించు.. డ్రెస్ వేసుకొని బ్యాగ్రౌండ్ లో అలా వచ్చి ఇలా వెళ్ళిపో అని చెప్పాను. కానీ నా మాటలకు ఆమె తంతా అని సమాధానం ఇచ్చింది. అంటూ మంచు విష్ణు పబ్లిక్ గానే చెప్పేశారు.అయితే ఈ మాటలతో మంచు విష్ణుని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. భార్య చేతిలో ఎన్నిసార్లు తన్నులు తిన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నా భార్య తంతుంది అని మాట్లాడి మంచు విష్ణు తన పరువు తానే పోగొట్టుకున్నారు అంటూ సోషల్ మీడియా జనాలు విష్ణుని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: