సినిమా ఇండస్ట్రీలో అందం , అభినయం , నటన తో పాటు ఎవరికైతే మంచి విజయాలు తక్కుతాయో అలాంటి ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ స్టేటస్ను అత్యంత స్పీడుగా చేరుకోవడం మాత్రమే కాకుండా అదే రేంజ్ లో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ లక్షణాలు అన్నీ కలిగిన బ్యూటీలలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈమె కెరియర్ను మొదలు పెట్టిన దగ్గర నుండి నటించిన సినిమాలలో చాలా వరకు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఆ సినిమాలలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ స్టేటస్ కి చేరుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికీ అదే రేంజ్ లో కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కూడా రష్మిక మందన చేతిలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న చాలా సినిమాలు ఉన్నాయి. మరి రష్మిక ఇప్పటికే గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.

రష్మిక ప్రస్తుతం నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా ఈమె మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈ మూవీ భారీ మాస్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు ఈ బ్యూటీ తమ రెయిన్బో , తమ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పుష్ప 3 మూవీ కనుక స్టార్ట్ అయితే అందులో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ఇలా రష్మిక చేతిలో ప్రస్తుతం ఆరు క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm