యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా వరుస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం పాటు వరుస అపజయాలను ఎదుర్కొన్న తారక్ "టెంపర్" మూవీతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. అప్పటినుండి ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆఖరుగా తారక్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం తారక్ ఓ వైపు వార్ 2 సినిమాలో నటిస్తూనే మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 సినిమాకు సంబంధించిన పనులు ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. ఈ సినిమాలో తారక్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల గురించి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. చివరకు ఈ సినిమా యొక్క థియేటర్ హక్కులను ఓ సంస్థ ఏకంగా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే వార్ 2 మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను నాగ వంశీ దక్కించుకోబోతున్న వార్తలు వచ్చిన ఆ వార్తలు మళ్లీ సైలెంట్ అయ్యాయి. ఇకపోతే వార్ 1 సినిమాను యాష్ రాజ్   ఫిలిమ్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో సొంతగా విడుదల చేయాలి అని ఈ సంస్థ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీ ని సొంతగా విడుదల చేసినట్లయితే మూవీ కి మంచి టాక్ వస్తే ఆ మూవీ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి అని ఆ సంస్థ వారు భావించడం , అందుకు తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను ఎవరికి అమ్మకూడదు అని మేకర్స్ స్ట్రాటజీ ప్లే చేసినట్లు తెలుస్తుంది. అదే స్ట్రాటజీ గనుక సక్సెస్ అయితే యాష్ రాజ్ సంస్థ వారికి వార్ 2 మూవీ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: