
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్గా జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కిన బిగ్ రి ప్రాజెక్టు ఈ హరిహర వీరమల్లు. ఈ సినిమా విషయంలో అభిమానులకు మాత్రం కావాల్సినంత డిసప్పాయింట్మెంట్ ని మేకర్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే వస్తున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడమే. దానికి తగ్గట్టే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏది సరిగ్గా ఇవ్వడం లేదు అంటూ పవన్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నాడు.
ఎప్పుడో రావాల్సిన సినిమా పవన్ డేట్స్ లేక ఈ ఏడాదికి వచ్చింది . పోనీలే ఈ ఏడాది రిలీజ్ అవుతుంది అనుకుంటే బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ పోన్ అవుతూ రావడం.. ఆ తర్వాత సినిమాకి సంబంధించి సరైన క్లారిటీ మేకర్స్ ఇవ్వలేకపోవడంతో పవన్ ఫాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎంతో మచ్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు ట్రైలర్ పై ఈ వారంలో అప్డేట్ ఇస్తున్నట్లుగా కన్ఫామ్ చేశారు మేకర్స్ . కానీ ఆల్రెడీ వీకెండ్ కి వచ్చేసింది.. ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది .
కనీసం ఫ్యాన్స్ ని యాక్టివ్ చేస్తూ అప్డేట్ కాదు కదా మినిమం హింట్స్ కూడా ఇస్తూ హైప్ ఉన్న ఒక్క పోస్టర్ కూడా రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే కారణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ సినిమాపై ఇటువంటి నిర్లక్ష్యమా అంటూ మండిపడుతున్నారు . ఏదో ఎప్పుడో నామమాత్రంగా మాత్రమే ఈ సినిమా పరిస్థితి తెలియజేస్తున్నట్లు ట్రోల్ చేస్తున్నారు . ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయింది. దానికి తోడు ఈ లేట్ అప్డేట్స్ ఇంకా విసుకు తెప్పిస్తున్నాయి అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు కొంతమంది సహనాన్ని కోల్పోయి ఇది పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లోనే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మారిపోయింది అంటూ ఘాటు ఘాటుగా మండిపడుతున్నారు...!