జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఎంతో చలాకీగా నవ్వుతూ మీడియాలో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే స్వేచ్ఛ మరణం ఎంతో మందిని విషాదంలోకి నెట్టేసింది. అయితే స్వేచ్ఛ మరణం పై ఎన్నో రకాల కారణాలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే స్వేచ్ఛ మరణానికి తన కూతురితో సన్నిహితంగా ఉన్న పూర్ణచందరే  కారణం అంటూ తండ్రి ఒక సంచలన ఆరోపణ చేశారు. దీంతో స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం ప్రియుడే అని చాలామంది అనుకున్నారు. ఎన్నో వార్తలు కూడా రాసుకొచ్చారు.అయితే సడన్గా స్వేచ్ఛ ఆత్మహత్య ఒక సంచలనం మలుపు తిరిగింది. దానికి కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్. మరి ఇంతకీ ఆ లెటర్లో ఏముంది.. దాన్ని ఎవరు రాశారు అనేది చూద్దాం.

 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ 5 పేజీలు లేఖ వైరల్ అవుతుంది. అయితే ఆ లేఖ రాసింది ఎవరో కాదు స్వేచ్ఛ ప్రియుడు పూర్ణచందర్..మరి అందులో ఏముందంటే.. స్వేచ్ఛకి నాకు 2009 నుండి పరిచయం ఉంది.ఆమెకు 2009 లో మొదటి విడాకులు అయ్యాయి. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి కూడా విఫలమైంది.2017లో మళ్లీ విడాకులు తీసుకుంది.. అలా రెండుసార్లు ఆమె విడాకులు తీసుకోవడంతో చాలా దిగ్బ్రాంతికి లోనైంది.ఆ సమయంలోనే నాకు స్వేచ్ఛకి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఇక స్వేచ్ఛ తనతో తరచూ తన ఇంటి విషయాలను పంచుకునేది.తన తల్లిదండ్రులు చిన్నప్పుడే తనని తన అన్నా వదినల దగ్గర వదిలి వెళ్లిపోయారని, వీలు కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి పోయే వారిని చెప్పింది.అంతేకాకుండా రెండుసార్లు విడాకులు అయ్యాక స్వేచ్ఛ నాకు మరింత దగ్గరై 2020 నుండి చాలా క్లోజ్ గా ఉన్నాం.

2022లో తన తల్లిదండ్రులు గొడవ పడడం చూసి తట్టుకోలేక చివరికి సొంతంగా ఓ ఇల్లు అద్దె కు తీసుకుంది. ఆ తర్వాత తనతో సన్నిహితంగా మెదిలి నేను తన భాగస్వామినే అని ఫిక్స్ అయ్యి అన్నింట్లో స్వేచ్ఛ పూర్వ చందర్ అని రాసుకువచ్చింది. అలా నేను కూడా స్వేచ్ఛతో భర్తలాగే మెదిలాను.ఆమె కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్ ని కూడా ఐదు లక్షలు ఖర్చుపెట్టి గ్రాండ్గా చేశాను. స్వేచ్ఛతో ఆమె కూతురితో నాకు ఎలాంటి గొడవలు లేవు. స్వేచ్ఛ మానసికంగా చాలా బాధపడిపోయేది. ఎంతమంది మానసిక వైద్యులకు స్వేచ్ఛను చూపించానో దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్ లు నా గదిలో సురక్షితంగా ఉన్నాయి. నేను స్వేచ్ఛ మరణానికి కారణం అంటే స్వేచ్ఛ బంధువులు కూడా నమ్మరు.

 నేను స్వేచ్ఛ తో ఎలా ఉన్నానో ఆమెని,ఆమె కూతుర్ని ఎలా చూసుకున్నానో స్వేచ్ఛ బంధువులకు పూర్తిగా తెలుసు. స్వేచ్ఛ చనిపోయే ముందు రోజు రాత్రి ఆమె తండ్రి వచ్చి మాట్లాడిన మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది.రెండు సంవత్సరాలకు ఒకసారి ఈయనే మీ అల్లుడు అని చూపిస్తున్నావు అంటూ చాలా అసభ్యంగా మాట్లాడారు. ఒక తండ్రి కూతుర్ని అనాల్సిన మాటలు కాకుండా అసభ్యంగా మాట్లాడడంతో స్వేచ్ఛ కన్నీళ్లు పెట్టుకుంది అంటూ పూర్ణచందర్ తన లేఖలో రాసుకొచ్చారు.అయితే ప్రస్తుతం పూర్ణచందర్ రాసిన లేఖ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు స్వేచ్ఛ ఆత్మహత్యకి కారణం నేను కాదు తండ్రే అంటూ పరోక్షంగా పూర్ణచందర్ చెప్పారంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: