
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ షో ప్రసారమవుతుంది. ఈ షోను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం తక్కువేం కాదు. బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ సాధించినా ఈ షో తర్వాత సీజన్ కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదనే సంగతి తెలిసిందే. గత సీజన్ కు ఈ షో నిర్వాహకులు భారీ మొత్తంలో ఖర్చు చేశారు.
బిగ్ బాస్ షో రేటింగ్స్ సైతం రోజురోజుకు మరీ తీసికట్టుగా తయారవుతూ ఉండటం గమనార్హం. ఈ షో నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్9 ను కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్9 లో క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు పాల్గొననున్నారని అదే సమయంలో సామాన్యులకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. ఈసారి టాస్కులను సైతం కొత్తగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియా సెలబ్రిటీలకు ప్రాధాన్యత తగ్గించనున్నారని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో వెబ్ సైట్ ద్వారా రిజిష్టర్ కావడంతో పాటు ఎందుకు ఈ షోలో పాల్గొంటున్నారో వెల్లడిస్తూ వీడియోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ షో ద్వారా 9 మంది సామాన్యులు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బిగ్ బాస్ షో హోస్ట్ మారతారని ప్రచారం జరుగుతుండగా నాగార్జున సీజన్9 కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ షో సీజన్9 రేటింగ్స్ పరంగా సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో ఏ తేదీ నుంచి ప్రసారమవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. ఛానల్ నిర్వాహకులు బిగ్ బాస్ షోకు హోస్ట్ ను మార్చితే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం