కాంటా లగా గర్ల్ షెఫాలీ చావుతో .. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది .. ఆ షెలో పాల్గొన్న న‌టీ నటులు ఊహించ‌ని విధంగా చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . ఇదంతా యాదృశ్చికంగానే జరుగుతుందా .. అనే చర్చ మాత్రం ఇప్పుడు షోపైకి వెళ్ళింది .. ఇంతకు ఆ షో ఏంటి .. మన తెలుగులోనూ ఈ షో రన్ అవుతుంది .. మన దగ్గర కూడా ఇలాంటి సడన్ చావులు చోటు చేసుకున్నాయా ..? సోమదాస్ చాతన్నూర్, జయశ్రీ రామయ్య,, మన టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్ .. వీరందరూ మరణించారు . అయితే వీరందరి చావు యాదృశ్చికమే కానీ వీరందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది .. అదే బిగ్ బాస్ షో .. వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారు ..

షెఫాలీ జరివాలా బిగ్ బాస్ 13లో పాల్గొన్న ప్రముఖ నటి, 42 ఏళ్ళ వయసులో ఈ శుక్రవారం రాత్రి ఊహించ‌ని విధంగా గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది .. 2002లో  ‘కాంటా లగా’  మ్యూజిక్ వీడియోతో యువతను తన అందంతో కట్టిపడేసింది షెఫాలీ .. అయితే ఆమె ఎలా చనిపోయిందనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు .. ప్రజెంట్ పోలీసుల విచారణ జరుగుతూనే ఉంది షెఫాలీకి డిప్రెషన్, ఎపిలెప్సీ సమస్యలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది . ఇదే క్రమంలో షెఫాలీతో పాటు ఈ షోలో పాల్గొన్న మరి కొంతమంది నటులు అతి చిన్న వయసులోనే చనిపోయారు .. సిద్ధార్థ్ శుక్లా , బిగ్బాస్ 13 విజేత 2021లో 40 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు .. ఇక శుక్లాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది .

ప్రత్యూషా బెనర్జీ బిగ్ బాస్ 7 ఈమె పాల్గొంది .. అయితే 2016లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది .. పలు టీవీ కార్యక్రమాలతో ప్రత్యూష ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది .. అలాగే స్వామి ఓం బిగ్బాస్ 10 లో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన కంటిస్టెంట్ .. 2021 లో కోవిడ్ కారణంగా చనిపోయాడు . సోనాలీ ఫోగట్ బిగ్బాస్ 14లో పాల్గొన్న ఈ పొలిటికల్ లీడర్ 2023లో 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయింది .. అలాగే  సోమదాస్ చాతన్నూర్ మలయాళ బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్నారు అయితే 2021లో కోవిడ్ తో చనిపోయాడు . జయశ్రీ రామయ్య బిగ్ బాస్ కన్నడ 3 సీజన్ లో కనిపించిన నటి 2020లో ఆత్మహత్య చేసుకుని మానసిక సమస్యల కారణంగా చనిపోయినట్టు పోలీస్ రిపోర్టులో తేలింది .

తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ కత్తి మహేష్ సైతం మరణించారు .. 2021 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు చికిత్స తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి విషమించి చనిపోయారు .  అలాగే తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ కూడా ఆరోగ్యం బాగోక పచ్చకామెర్లు , గుండుపాడుతో మరణించారు . 2024 మార్చి 11న చెన్నైలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు .. అయితే ఇలా గుండుపడుతో , ఆత్మహత్య కోవిడ్ 19 వంటి కారణాలతో వీరంతా చనిపోయారు . ఈ కంటెస్టెంట్ మరణాలకు బిగ్ బాస్ షోకు ఎలాంటి సంబంధం లేదు .. కానీ యాదృశ్చికంగా చోటుచేసుకుంటున్న సంఘటనలే .. కానీ వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో చర్చ బిగ్ బాస్ పైకి వెళ్ళింది .

మరింత సమాచారం తెలుసుకోండి: