
టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు హీరో గా , ప్రీతి ముకుందన్ హీరోయిన్గా హిందీ లో రామాయణ్ , మహాభారత వంటి అద్భుతమైన సీరియల్స్ తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో లేటెస్ట్ డివోషనల్ హిట్ మూవీ కన్నప్ప .. భారి అంచనాల నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుని మంచి రన్ తో దూసుకు వెళుతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం డిప్యూటీ సీఎం రెడీ అయ్యారట .. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు కానే కాదు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్ ని చూడబోతున్నారట ..
హైదరాబాద్ లో మహేష్ థియేటర్స్ ఏఎంబీ మాల్ లో ఈ సాయంత్రం 7 గంటలకు మోహన్ బాబు , మంచు విష్ణు లతో కలిసి ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొనబోతున్నారట .. ఇక మరి ఈ షో అయ్యాక తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సినిమా పై ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి .. ఇక కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ రాబడుతుంది .. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కన్నప్ప 20 కోట్లు వసూలు చేసిన కన్నప్ప సినిమా రెండోరోజు 22.5 కోట్లు రాబట్టింది .. ఇక ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు .. ఇదే జోష్‌తో ఈ మూవీ 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..