
చిరంజీవి జోక్యం చేసుకుంటే మాత్రమే ఈ పరిస్థితి మారుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమా ఈ ఏడాదే విడుదలవుతుందా లేక వచ్చే ఏడాది విడుదలవుతుందా అనే ప్రశ్నకు సంబంధించి సమాధానాలు దొరకాల్సి ఉంది. విశ్వంభర ఓటీటీ డీల్స్ గురించి సైతం వేర్వేరు వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. విశ్వంభర సినిమా హిట్టవ్వాలంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావాలి.
సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యం కావడం వల్ల ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాపై అంచనాలు తగ్గే అవకాశం ఉంది. విశ్వంభర సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర కొత్త డేట్ గురించి మేకర్స్ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఎప్పటికీ పూర్తవుతుందో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
ప్రస్తుతం అక్టోబర్ మాత్రమే విశ్వంభర సినిమా ముందు ఉన్న ఏకైక అప్షన్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని సాంగ్స్ విడుదలైనా ఆ సాంగ్స్ ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. చిరంజీవి పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు