
తన పని తాను చేసుకోబోతున్నాడు . రీసెంట్ గానే రెట్రో సినిమాతో అభిమానులని పలకరించిన సూర్య ప్రెసెంట్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు . కాగా రీసెంట్గా హీరో సూర్య తన భార్యతో వెకేషన్ కి వెళ్ళాడు . చాలామంది దీన్ని సెకండ్ హనీమూన్ అంటున్నారు . ఎందుకంటే ఈ వెకేషన్ లో పిల్లలు లేరు కేవలం సూర్య - జ్యోతిక మాత్రమే ఉన్నారు . దీంతో ప్రతి ఒక్కరు కూడా సూర్య - జ్యోతిక సెకండ్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ రొమాంటిక్ గా కామెంట్స్ పెడుతున్నారు .
కాగా వీళ్ళు వెకేషన్ కి వెళ్ళింది తూర్పు ఆఫ్రికాలోని సిషెల్స్ కు . ఇది చాలా చాలా స్పెషల్ ప్లేస్ . మరీ ముఖ్యంగా నేచర్ ని ఇష్టపడే వాళ్ళు కచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటారు . కొంతమంది వాళ్ళ హనీమూన్ స్పాట్ గా కూడా ఈ సిషెల్స్ ని ఎంచుకుంటూ ఉంటారు . దానికి కారణం అక్కడ చాలా స్వచ్ఛమైన గాలి . మరి ముఖ్యంగా ఎటు చూసినా నీరు .. బాగా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది . మంచిగా రిలాక్స్ అవ్వచ్చు . మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే అలాంటి స్పెషల్ ప్లేస్ కి సూర్య - జ్యోతిక సెకండ్ హనీమూన్ కోసం వెళ్లి ఉంటారు అంటున్నారు అభిమానులు . పిల్లలను ఇండియాలో విడిచి ఏకాంతంగా గడిపేందుకు వెళ్ళిన్నట్లున్నారు అంటూ కుర్రాళ్ళు నాటీ కామెంట్స్ పెడుతున్నారు . అక్కడ సముద్రం దగ్గర అడవుల లో ఇతర అందాలను ఆస్వాదిస్తూ గడిపేస్తుంది ఈ జంట . దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!