
జులై , ఆగస్టు దాటితే విశ్వంభరకు రెండు సమస్యలు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ చేస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమాకు విశ్వంభరకు మధ్య విడుదల తేదీల్లో గ్యాప్ బాగా తగ్గిపోతుంది .. పోనీ నేరుగా 2026 సంక్రాంతికి విడుదల చేద్దామంటే ఇప్పటికే అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ జనవరి 10న రాబోతున్నట్టు కన్ఫామ్ చేసుకుంది . ఇలా ఈ నెల రోజుల్లో విశ్వంభర రిలీజ్ తేదీ పై క్లారిటీ వస్తే అంతా మంచిదే .. లేదంటే మాత్రం ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ అవ్వటం కష్టమే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి .. అలాగే ఈ సినిమా టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ పై ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే .. ఇక అప్పటి నుంచి విశ్వంభరకు గ్రాఫిక్ కష్టాలు భారీగా మొదలయ్యాయి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు