కొన్ని సంవత్సరాల క్రితం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్ "పెళ్లి చూపులు" మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని, మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. పెళ్లి చూపులు లాంటి విజయవంతమైన సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నలుగురు ఫ్రెండ్స్ మధ్య సాగుతుంది. నలుగురు ఫ్రెండ్స్ కొంత కాలం గ్యాప్ తర్వాత కలిసాక వారి జీవితాల్లో ఏం జరిగింది. వారు మద్యం తాగాక గోవాకు వెళ్లాలి అని ప్లాన్ చేయడం, అనుకున్నదే ఆలస్యం గోవాకి నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్లడం, అక్కడ వారి నలుగురికి అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే దానిని పూర్తిగా కామెడీ యాంగిల్ లో చిత్రీకరించారు. ఈ సినిమా యువతను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక ఎప్పటి నుండో అనేక మంది ఈ నగరానికి ఏమైంది సినిమాకు సిక్వెల్ ను రూపొందిస్తే బాగుంటుంది అని దానికి అద్భుతమైన రీచ్ వస్తుంది అని ఒక వేళ ఈ నగరానికి ఏమైంది స్థాయిలో కనుక ఆ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్  చేయగలిగినట్లయితే ఆ మూవీకి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తాయి అని అనేక మంది భావించారు.

అందుకు తగినట్లుగానే తరుణ్ భాస్కర్ తాజాగా ఈ నగరానికి ఏమైంది మూవీ కి సీక్వల్ గా ఈNఈ టైటిల్తో మూవీ ని రూపొందించనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవాకు వెళ్లి జనాలను ఎంటర్టైన్ చేశారు. మరి ఈ సారి తరుణ్ భాస్కర్ ఫ్రెండ్స్ అందరిని ఎక్కడికి తీసుకువెళ్తాడా..? జనాలను ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ene