టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులలో వెంకి అట్లూరి ఒకరు. ఈయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలుపెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ దర్శకుడు నితిన్ హీరోగా రంగ్ దే అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే ఈ మూడు సినిమాలలో కూడా సెకండాఫ్ ఫారన్ కంట్రీలో ఉంటుంది. దానితో చాలా మంది వెంకీ అట్లూరి సినిమాల్లో సెకండ్ హాఫ్ కచ్చితంగా ఫారన్ లో ఉంటుంది. ఆయన ఆ ఫార్మాట్ ను మార్చుకుంటే బాగుంటుంది అని ఆయన పై విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ నటుడు అయినటువంటి సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఆయన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ... నేను రాసుకున్న ప్రతి కథను ఫస్ట్ నాగ చైతన్య కే చెప్పాను. డేట్స్ కుదరక మరికొన్ని కారణాలతో ఇప్పటి వరకు నాగ చైతన్య తో సినిమా చేయలేదు అని చెప్పారు. అలాగే నెక్స్ట్ మూవీ అయినా చేద్దామని జోక్ చేసుకుంటూ ఉంటాము అని వెంకీ అట్లూరి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కొంత కాలం క్రితమే తండేల్  అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలోని నటనకు గాను నాగ చైతన్య కు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vk