టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సౌత్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసిన దగ్గర్నుంచి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయింది .. అయితే ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెడతారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఈ క్రమంలోని ఈ సినిమాకు సంబంధించిన తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు .. అలాగే ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్ .. ఇక ఈ సినిమాని పూరి జగన్నాథ్ , చార్మి కలిసి పూరి కనెక్ట్ బ్యానర్ పై నిర్మించబోతున్నారు .. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులోకి జేబీ మోషన్ పిక్చర్స్ కూడా చేతులు కలిపింది .. ఇక దీంతో పూరి కనెక్ట్స్‌తో పాటు బేబీ మోషన్ పిక్చర్స్ పై కూడా జెబి నారాయణ రావు కొండ్రొల్ల ఈ సినిమాను నిర్మించబోతున్నారు ..
 

అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు హాట్ బ్యూటీ సంయుక్త మీనన్, కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ , సీనియర్ బ్యూటీ ట‌బు వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు .. అలాగే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది .. పూరి ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ఒకే చేశారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి .. ఇక మరి పూరి, విజయ్ సేతుపతి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కంబ్యాక్ ఇచ్చి ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి ...



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: