తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రోజు మాస్ ఈమేజ్ కలిగిన హీరోలను మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఎన్నో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోలుగా నటించి ఎన్నో విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇప్పటికే వీరిద్దరూ 60 సంవత్సరాలలోకి అడుగు పెట్టిన కూడా కుర్ర హీరోల స్థాయిలో సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. చిరు, బాలయ్య ఇప్పటి వరకు ఎన్నో సార్లు బాక్సా ఫీస్ దగ్గర తలపడ్డారు. అందులో కొన్ని సార్లు చిరంజీవి గెలుపొందితే మరి కొన్ని సార్లు బాలయ్య గెలుపొందాడు. ఇది ఇలా ఉంటే వీరిద్దరి మధ్య మొట్ట మొదటి బాక్స్ ఆఫీస్ క్లాష్ ఎప్పుడు ఎదురయింది. అందులో ఎవరు గెలుపొందారు అనే వివరాలను తెలుసుకుందాం.

చిరు, బాలకృష్ణ మధ్య మొట్ట మొదటి బాక్స్ ఆఫీస్ పోరు 1984 వ సంవత్సరంలో ప్రారంభం అయింది. అప్పుడప్పుడే వీరిద్దరూ స్టార్ హీరో రేసులో ముందు వరుసలోకి వస్తున్నారు. అలాగే వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతున్న సమయం అది. అలాంటి సమయంలో 1984 వ సంవత్సరం సెప్టెంబర్ 3 వ తేదీన బాలకృష్ణ హీరో గా రూపొందిన మంగమ్మ గారి మనవడు సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్గా నటించింది. ఇక 1984 వ సంవత్సరం సెప్టెంబర్ 6 వ తేదీన చిరంజీవి హీరోగా రూపొందిన ఇంటి గుట్టు సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో కూడా సుహాసిని హీరోయిన్గా నటించింది. ఇలా కేవలం మూడు రోజుల గ్యాప్ లోనే చిరు, బాలయ్య నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మంగమ్మ గారి మనవడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇంటి గుట్టు సినిమా పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ రెండు మూవీల ద్వారా సుహాసిని కి మాత్రం మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: