తమన్నా భాటియా రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తమన్నా గానీ,విజయ్ వర్మ గానీ ఈ బ్రేకప్ వార్తలపై ప్రత్యక్షంగా స్పందించి మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం అని ఎక్కడా కూడా చెప్పకపోయినప్పటికీ వీరిద్దరూ దూర దూరంగా ఉండటం, గత కొద్దిరోజులుగా కలిసి కనిపించకపోవడంతో  తమన్నా విజయ్ వర్మలు బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా తమన్నా కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలో తమన్నా ఫుల్లుగా తాగేసి కనిపించింది.ఇక తమన్నా, ప్రగ్యా జైస్వాల్, మృణాల్ ఠాకూర్ ఇద్దరితో కలిసి ఒక పార్టీలో కనిపించింది. 

ఆ పార్టీలో తమన్నా, ప్రగ్యా జైస్వాల్, మృణాల్ ఠాకూర్ వీరందరూ ఫుల్లుగా తాగేశారు. ఇక తమన్నా ఫేస్ చూస్తే మాత్రం పీకల దాకా తాగినట్టు కనిపిస్తోంది.అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది పాపం తమన్నా బ్రేకప్ బాధలో ఎంత తాగుతుందో కూడా తెలియకుండా తాగేస్తోంది..అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక తమన్నా దాదాపు మూడు సంవత్సరాలు విజయ్ వర్మతో డేటింగ్ చేసింది.

కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రీసెంట్గా బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక బ్రేకప్ తర్వాత విజయ్ వర్మ రీసెంట్ గా బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ తో కలిసి కనిపించారు. వీరిద్దరూ క్లోజ్ గా కనిపించడంతో తమన్నాని వదిలేసి ఫాతిమా సనా షేక్ తో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు కూడా వినిపించాయి.ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. వదిలాటు సినిమాలో లేడీ సన్యాసిగా కనిపించింది. ఇక ఈ సినిమా ఓ మోస్తరు హిట్ అయింది.. మళ్లీ ఇప్పటివరకు తమన్నా కొత్త సినిమాలు ప్రకటించకపోయినప్పటికీ బ్రేకప్ కారణంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: