టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రావణ భార్గవి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. శ్రావణ భార్గవి వ్యక్తిగత జీవితం గురించి వేర్వేరు సందర్భాల్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. శ్రావణ భార్గవి భర్త పేరు హేమ చంద్ర కాగా వీళ్లిద్దరూ చాలా కాలంగా విడిగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ నెగిటివ్ కామెంట్ల గురించి ఈ జోడీ ఎప్పుడూ స్పందించని సందర్భాలు అయితే లేవనే చెప్పాలి.

శ్రావణ భార్గవి  తన కూతురితో భర్త లేకుండానే ఒంటరిగా ట్రిప్స్ కు వెళ్తుండటం  గమనార్హం.  అయితే శ్రావణ భార్గవి తాజాగా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతోంది.  లైఫ్  చాలా సున్నితమైనదని  అవసరాలు, గొడవలు,  అపార్థాలు, చిక్కుముళ్లు  వీటితో  బ్రతికేయడంలో అర్థం పర్థం  లేదని  ఆమె చెప్పుకొచ్చారు.  ప్రేమ  ఒక్కటే అర్థవంతమైందని  మనం మనస్ఫూర్తిగా  ఒకరిని  ప్రేమించినప్పుడు  తప్పు చేస్తున్నామా  అని అనిపించిందని   ఆమె కామెంట్లు చేశారు.

ఉదారంగా మంచి మనస్సుతో  ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించాలని  ఆ ప్రేమే మనం జీవితంలో  గెలిచామా ఓడామా అనేది  నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.  ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా  వేదికగా వైరల్ అవుతున్నాయి.  శ్రావణ  భార్గవి సంచలన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతుండటం గమనార్హం.

గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా  సినిమాలలో శృతి హాసన్ పాత్రకు  శ్రావణ భార్గవి డబ్బింగ్ చెప్పారు.  శ్రావణ భార్గవి దంపతులకు శిఖర చంద్రిక అనే కూతురు ఉన్నారు.  ఒకప్పుడు  శ్రావణ భార్గవి హేమ చంద్ర కలిసి టీవీ షోలు చేశారు.  ఒక షార్ట్ ఫిలిం లో సైతం ఈ జోడీ జంటగా నటించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: