పూజ హెగ్డే ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో చేస్తోంది.. బాలీవుడ్ లో పూజ హెగ్డే వరుణ్ దావణ్ తో కలిసి ఓ సినిమాలో నటించింది.ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అలాగే రీసెంట్ గా కోలీవుడ్ నటుడు సూర్యతో కలిసి రెట్రో మూవీ చేసినప్పటికీ ఆ సినిమా  అనుకున్నంతగా హిట్ కాలేదు. దాంతో పూజ హెగ్డే కి వరుస ప్లాఫ్ లు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పటినుండి ఆమె చేసే సినిమాలన్నీ ఫ్లాఫ్ అవుతున్నాయి. అలా క్రమక్రమంగా పూజ హెగ్డే గ్రాఫ్ సినీ ఇండస్ట్రీలో పడిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా పూజ హెగ్డే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోతో విదేశాల్లో చక్కర్లు కొడుతున్నట్టు కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఆ ఫోటోలలో ఆ హీరోతో కలిసి చాలా క్లోజ్ గా కనిపించింది పూజ హెగ్డే. ఇక ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి పూజ హెగ్డే ఈ హీరోతో కలిసి విదేశాలలో ఎంజాయ్ చేస్తోంది..వీరిద్దరి కాంబోలో సినిమా కూడా రావడం లేదు. అలాంటిది వీరిద్దరూ కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు అని షాక్ అయిపోతున్నారు. ఇక పూజ హెగ్డే తో ఉన్న ఆ హీరో ఎవరయ్యా అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.పవన్ కళ్యాణ్ కి సినిమాలకు డేట్స్ ఇవ్వడానికే టైం కుదరడం లేదు. అలాంటిది పూజ హెగ్డే తో విదేశాలకు వెళ్లే అంత సమయం ఉందా అనుకుంటారు ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు. ఇంకొంత మందేమో పవన్ కళ్యాణ్ పూజ హెగ్డే కి ఏమైనా కొత్త ప్రియుడా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్, అవి ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ మాత్రమే అని క్లియర్ గా గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ పూజ హెగ్డే ఇద్దరు విదేశాల్లో తిరుగుతున్నట్టు కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవి ఏఐ ఫొటోస్ అని పవన్ కళ్యాణ్ అభిమానులు పూజ హెగ్డే అభిమానులు కొట్టి పారేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన ఏఐ ఫోటోలు ఇలాగే వైరల్  అవుతున్న సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు కొంతమంది నటీనటులు లిప్ కిస్లు పెట్టుకున్నట్టు,బికినీలలో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటి ఏఐ క్రియేటెడ్ వైరల్ ఫోటోలలో పవన్ కళ్యాణ్ పూజ హెగ్డే కలిసి ఉన్న ఫోటో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: