
మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ తో కలిసి చేసిన మూవీ ఆచార్య .. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా మిగిలింది .. ఈ ఒక్క ప్లాప్‌తో కొరటాలతో సినిమా చేసేందుకు ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు .. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఓ అవకాశం ఇచ్చారు .. దేవర సినిమాతో కొరటాల బౌన్స్ బ్యాక్ అయ్యాడు .. సూపర్ హిట్ తో పాటు భారీ కలెక్షన్ కూడా అందుకున్నాడు .. కానీ ఇప్పుడు శివకు మరోసారి హీరో కష్టాలు తప్పటం లేదు ..
ప్రస్తుతం శివ తో సినిమా చేసేందుకు హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు .. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు ఎవరు మరో రెండు సంవత్సరాలు ఖాళీగా లేరు .. నాని, విజయ్ దేవరకొండ లైనప్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది .. అంతకంటే చిన్న హీరోలతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తిగా లేడు .. ఇక చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా దేవర 2 .. కానీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు .. అసలు మొదలు అవుద్దొ లేదో కూడా తెలియదు .. ఇంకా చేస్తే సీనియర్ హీరోలతో చేయాలి మరి కొరటాలకు అవకాశం ఇచ్చేది ఎవరు ..