సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలో వేరే వాళ్ళు హీరోగా నటించిన సందర్భంలో ఆ మూవీలు అద్భుతమైన విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించి ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినట్లయితే ఫలానా హీరోమూవీ కథను రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాడు. లేదంటే ఫ్లాప్ వచ్చేది అని అభిప్రాయాలను వ్యక్తం చేయడం, అదే సినిమా మంచి విజయం సాధించి ఉండి ఉంటే ఆ రోజు ఆ మూవీ ఒప్పుకొని ఉంటే ఆ నటుడికి అద్భుతమైన విజయం వచ్చేది అని అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరగడం సర్వసాధారణమైన విషయం.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నాని, చైతూ ఓ కథ ను రిజక్ట్ చేయగా అందులో పక్క భాష నటుడు అయినటువంటి దూల్కర్ సల్మాన్ హీరోగా నటించగా ఏకంగా ఆ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ ఆటోరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా వెంకీ అట్లూరి నేను ఇప్పటివరకు రూపొందించిన ప్రతి సినిమా కథను మొదట నాగ చైతన్య కు వినిపించాను.

కానీ కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి కాంబోలో సినిమా రాలేదు అని చెప్పుకొచ్చాడు. దానితో ఈ మూవీ కథను కూడా వెంకీ అట్లూరి, చైతూ కిచెప్పినట్లే అవుతుంది. ఇక నాని కూడా ఈ మూవీ కథను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా చైతూ, నాని రిజెక్ట్ చేసిన సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 100 కోట్లకు మించిన కలెక్షన్లను కూడా రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: