
కాని ఆర్య సినిమా విడుదలయ్యే వరకు రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో అనే విషయంపై చాలా భయపడ్డామని తెలిపారు .సినిమా విడుదల అయ్యే వరకు టెన్షన్ తోనే రెమ్యూనరేషన్ గురించి ఎక్కువగా అల్లు అరవింద్ గారిని అడిగామని కానీ ఆయన కంగారు పడకండి అంటూ చెప్పారు. సినిమా విజయం సాధించిన తర్వాత వెళ్లి అడిగితే నైజాం కలెక్షన్స్ లో కోటి రూపాయలు వసూలు చేస్తే 10 లక్షలు.. రెండు కోట్లు వసూలు చేస్తే 20 లక్షలు ఇవ్వమని చెప్పారట..
అలా నాలుగు కోట్లు చేస్తే 40 లక్షలని.. 5 కోట్లు వసూలు చేసిన 50 లక్షలు ఇవ్వాల్సిన పనిలేదంటూ చెప్పారట. అయితే చివరికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 40 లక్షలు అని చెప్పారట. అయితే ఆ డబ్బులను కూడా తర్వాత ఇవ్వమని చెప్పారట అల్లు అరవింద్..కానీ కొంత మంది సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్ కుమారులు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి రెమ్యూనరేషన్ కోసం నిర్మాతలను సైతం చాలా పీడిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విషయంపై పలు రకాల అనుమానాలు మొదలవుతున్నాయి. మరి ఏంజరుగుతుందొ చూడాలి మరి.