
ఫిష్ వెంకటేష్ ఆరోగ్యం చాలా క్షీణించిందని కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో తొమ్మిది నెల క్రితమే డయాలసిస్ చేయించుకున్న మళ్లీ ఆయన ఆరోగ్యం కూడా చేయనించిందని వెంటిలేటర్ పైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఆయన ఎవరిని కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయారని ఎవరైనా సహాయం చేయాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఫిష్ వెంకటేష్ భార్య , కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అద్భుతమైనటుడికి డయాలసిస్ చేస్తున్నట్లుగా వైద్యులు తెలియజేస్తున్నారు.
గతంలో దయాలసిస్ కు డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు ఫిష్ వెంకటేష్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్ గ్యాంగ్ లో ఫిష్ వెంకటేష్ మెయిన్ విలన్ గా నటిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఆది చిత్రంలో తోడగోట్టు చిన్న అనే డైలాగుతో భారీ క్రేజీ సంపాదించుకున్నారు ఈ నటుడు. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ నటుడికి ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయాలి అంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.. నాలుగు సంవత్సరాల క్రితమే బిపి, షుగర్ వంటివి రావడంతో కాళ్లకు కూడా చాలా ఇన్ఫెక్షన్ అయ్యిందని సమాచారం. మరి సినీ సెలబ్రిటీలు ఎవరైనా సహాయం చేస్తారేమో చూడాలి.