పాపం ..తాను ఒకటి తలుచుకుంటే దైవం మరొకటి తలచింది అన్నట్లు తయారయింది పరిస్థితి . నిజానికి శిరీష్ చాలా చాలా హుందాగా నిజాయితీగా మాట్లాడాడు అంటూ జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు . కానీ మెగా ఫాన్స్ ఎక్కువగా ఓవర్ చేస్తూ హంగామా చేసి ఆయన దగ్గర సారీ చెప్పించారు అంటూ మండిపడుతున్నారు.  మనకు తెలిసిందే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దిల్ రాజు బ్రదర్ శిరిష్. మాటల సంధర్భంలో "గేమ్ ఛేంజర్" సినిమా ప్లాప్ అయినప్పటి నుండి చరణ్ ఫోన్ చేయలేదు..డైరెక్టర్ పట్టించుకోలేదు అని చెప్పారు.
 

దీనిని మెగా ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారు . ఆయనకి  వార్నింగ్ ఇస్తూ  లేఖ  కూడా విడుదల చేశారు.  సోషల్ మీడియాలో ఈ లేఖ ఎంత వైరల్ అయింది అనేది కూడా అందరికీ తెలిసిందే . కాగా  ఫైనల్లీ శిరీష్ రెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సారీ చెప్పారు . "నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ అంటూ బహిరంగ క్షమాపణలు చెప్పారు."  దీంతో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది అనుకున్నారు.  కానీ కాలేదు ముందుంది ముసలి పండుగ అంటూ తాజాగా ఓ న్యూస్ తెర పై కి వచ్చింది .



దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ ప్రాజెక్ట్ తమ్ముడు . నితిన్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.  నితిన్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు . ఈ సినిమా హిట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ . రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అన్ని కూడా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేసేలా చేసింది.  కానీ తాజాగా శిరీష్ మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేసాయ్ . ఆ కారణంగానే కొంతమంది మెగా ఫాన్స్ నితిన్ తమ్ముడు సినిమాని ఫ్లాప్  చేస్తామంటూ మాట్లాడుతున్నారు .



దీంతో నితిన్ ఫాన్స్ కూడా రంగంలోకి దిగారు.  వాళ్లు వాళ్లు కొట్టుకొని మా హీరో సినిమా ని  ఎందుకు ఫ్లాప్ చేస్తారు..?  మీరు ప్లాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..? అంటూ రివర్స్ కౌంట్ర్స్  వేస్తున్నారు . అయితే ఇలా ఫ్యాన్స్ గొడవలు పడకుండా దిల్ రాజు ముందుగానే పరిస్థితి చక్కదిద్దడానికి రామ్ చరణ్ చేతే తమ్ముడు సినిమాని చూడాలి అనే విధంగా ఒక ప్రమోషన్ వీడియోని చేయించబోతున్నారట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్  అవుతుంది
. చూడాలి మరి దిల్ రాజు కోరికను రామ్ చరణ్ తీరుస్తాడో..? లేదో..? నితిన్ సినిమాకి సపోర్ట్ చేస్తూ ప్రమోషన్ వీడియోని రిలీజ్ చేస్తాడో..? లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి: