
"హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం పకృతి పురుడు పోసుకుంటున్న సమయం. అనే గూస్ బంప్స్ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అంతెకాదు ఈ ట్రైలర్ చూస్తుంటే.. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని ఈజీ గా అర్ధం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్రకి పవన్ కళ్యాణ్ ది పర్ఫెక్ట్ ఛాయిస్ అనే విషయం ఇప్పుడు హైలైట్ గా మారింది .
ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించడం హైలైట్ . కాగ ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల ముందే రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉంది అంటూ పవన్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. అయితే ట్రైలర్ ఎంత బాగున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక్క సీన్ అస్సలు చూడ బుద్ధి కావడం లేదు .
దానికి కారణం ఆ సీన్ లో సత్యరాజ్ కనిపించడమే . రీసెంట్గా సత్యరాజ్ పవన్ కళ్యాణ్ పై ఎలా మండిపడ్డారు అనేది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా "దేవుడుని అడ్డుపెట్టుకొని పాలిటిక్స్ చేస్తే తాటతీస్తాం" అనే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు . అలాంటి వ్యక్తిని ఈ సినిమాలో చూపించడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు . కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెంటనే సత్యరాజ్ ఉన్న సీన్స్ డిలీట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . మరి కొందరు మాత్రం ఇది ఆయనతో గొడవ పడక ముందు చిత్రీకరించిన షూట్ ఇప్పుడు డిలీట్ చేస్తే బాగోదు .. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిది కాదు.. ఎవరినైనా సరే ఆదరిస్తారు. పాలిటిక్స్ పాలిటిక్సే.. సినిమా సినిమానే ..అలానే చూడండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో "హరిహర వీరమల్లు" ట్రైలర్ పై కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సత్య రాజ్ ఈ సినిమాలో ఉన్న సీన్స్ డిలీట్ చేయాలి అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉండడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూడాలి మరి మేకర్స్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో...???