"హరిహర వీరమల్లు".. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్  ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  ఆఫ్ కోర్స్ సినిమాపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి . మేకర్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కోప్పడ్డారు.  కానీ అదంతా పాజిటివిటీగా మార్చేశారు మేకర్స్ ఒకే ఒక్క ట్రైలర్ తో . రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది.  ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని మనం చూడని గెటప్ లో ఈ సినిమాలో చూడబోతున్నాం అని క్లారిటి వచ్చేసింది.


అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫుల్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో మనం ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ట్రైలర్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఈ సినిమాలో ఉండబోతుంది అంటూ జస్ట్ ట్రైలర్ తో చూపించేశారు . ఇప్పుడు సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . బాక్సాఫీస్ చరిత్రని సినిమా తిరగరాస్తుంది అని కొందరు అంటుంటే సినిమాలో వల్గర్ సీన్స్ లేకుండా ఫ్యామిలీ అంతా చూడదగిన సినిమాగా ఈ మూవీ తెరకెక్కించారు అని మరికొందరు అంటున్నారు.

 

కాగా మరికొందరు మాత్రం ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో "చావా" మూవీ క్రియేట్ చేసినంత రికార్డ్ తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేయబోతుంది అంటున్నారు .  నిర్మాత ఏం రత్నం హరిహర వీరమల్లు పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఆయన మాట్లాడుతూ.." ఈ సినిమా హరిహర వీరమల్లు బాగా అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది . మీరు పవన్ కళ్యాణ్ ని చాలా సరికొత్త పాత్రలో ఈ మూవీలో చూడబోతున్నారు . బాలీవుడ్ ఇండస్ట్రీకి చావా ఎలానో టాలీవుడ్ ఇండస్ట్రీకి హరిహర వీరమల్లు అలా అంటూ ఎవ్వరు ఊహించిన విధంగా సినిమా ఉండబోతుంది అంటూ ఊరించేశారు".



"పవన్ కళ్యాణ్ సినిమా పబ్లిక్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని ..చరిత్రను గుర్తు చేస్తుంది అని.. ఎందుకంటే ఈ మధ్యనే చావా అనే సినిమా రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది అని ..శివాజీ కొడుకు బయోపిక్ చాలా మందికి తెలియదు కానీ చూసి మాత్రం చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అని.. ఈ సినిమా కూడా అలానే కనెక్ట్ అవుతుంది అంటూ స్వయంగా హరిహర వీరమల్లు సినిమాపై తన వర్షన్ ని వినిపించారు". దీంతో ఈ సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: