కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో చిత్రవిచిత్రాలు భలే ఫన్నీగా జరుగుతూ ఉంటాయి. ఒక డైరెక్టర్ ఒక హీరోని ఉద్దేశించి ఒక కథ రాసుకుంటాడు.  ఆ కథ కోసం చాలా చాలా కష్టపడతాడు . ఫైనల్లీ ఆ కథను ఆ హీరోకి వినిపిస్తాడు . కొంతమంది హీరోలు తమ కోసం ఎంతో ఇష్టంగా డైరెక్టర్ రాసిన కథను ఓకే చేస్తారు. కొంతమంది కాల్ షీట్ అడ్జస్ట్ అవ్వక ఓకే చేయరు.  అయితే చాలా రేర్ సందర్భాలలో మాత్రమే ఒక హీరో ఒక కథను ఓకే చేసి సెట్స్ పైకి  తీసుకెళ్లాలి అనుకున్న మూమెంట్లో ఆ కథ వేరొక హీరో ఖాతాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు చూస్తూ ఉంటాం.


అలాంటి రేర్ పొజిషన్ ని ఫేస్ చేశారు హీరో రవితేజ . అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్.  ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలే.  తోపైన హీరోస్.  మాస్ పాత్రలకు భలే సూట్ అయిపోతారు.  కాగా గతంలో  ఎన్టీఆర్ చేయాల్సిన భద్ర మూవీ రవితేజ ఖాతాలో పడింది.  ఆ తర్వాత సేమ్ అలాంటి సిచువేషన్ ఒకటి ఫేస్ చేశారు . ఆ సినిమా మరేంటో కాదు "మిరపకాయ్".  హరిష్  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  మిరపకాయ్ సినిమాలో ముందుగా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అని అనుకున్నారట. ఈ కధ బాగా నచ్చేసిందట తారక్ కి.



కధ  చాలా బాగుంది ఫన్నీగా నాటిగా ఉంది అంటూ ఎన్టీఆర్ కూడా ఓకే చేశారట . కానీ ఆ తర్వాత  ఈ ప్రాజెక్టు ను సడెన్ గా క్యాన్సిల్ చేశారట తారల్  రాత్రికి రాత్రే ఈ సినిమా వద్దు అంటూ క్యాన్సిల్ చేశారట.. తెర వెనుక ఏం జరిగింది అనేది ఎవ్వరికి తెలియదు.  ఆ తరువాత హరీష్ శంకర్ ఈ కథను రవితేజకు వినిపించగా..  రవితేజ ఓకే చేసి సినిమాను సూపర్ డూపర్ హిట్ గా మలి చేశాడు . ఏ మాటక ఆ మాట "మిరపకాయ్" సినిమాలో  రవితేజ పర్ఫామెన్స్ ఘాటైన మిరపకాయలనే ఉంటుంది . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా నటించేసాడు. ఈ సినిమా ఎన్నిసార్లు టీవీలో చూస్తున్న ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక పాటలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెవ్వు కేక అంతే. ఇలాంటి సినిమాను తారక్ వదులుకోవడం ఆయనకి బిగ్ నెగిటివ్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: