
రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఏదైనా విషయం పై అరవింద్ కు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే కోణంలో విచారించినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణ అనంతరం మళ్లీ తిరిగి వచ్చేవారం అల్లు అరవింద్ విచారణకు హాజరు కావాలని మరొకసారి అధికారులు సూచించారట.ఈ పరిణామం ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయంశంగా మారుతున్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అల్లు అరవింద్ కుటుంబం తెలియజేస్తుందేమో చూడాలి.
అల్లు అరవింద్ ఒకవైపు నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గత కొంతకాలం నుంచి అటు అల్లు ఫ్యామిలీకి సైతం ఏదో ఒక విధంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉండడంతో అభిమానులు తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు. పుష్ప 2 సినిమా నుంచి మొదలు ఏదో ఒక విధంగా ఆల్లు కుటుంబం పేరు వినిపిస్తోంది. మరి ఇక మీదటనైనా ఇలాంటివి జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.